Saturday 19 November 2016

సాఫ్ట్‌వేర్ లోపాలు గుర్తిస్తే రూ.10 లక్షల నజరానా..!

సాఫ్ట్‌వేర్ లోపాలు గుర్తిస్తే రూ.10 లక్షల నజరానా..!



స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్లను తయారు చేసే క్వాల్‌కామ్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, ఔత్సాహికులకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తాము తయారు చేస్తున్న ప్రాసెసర్లు, మోడెమ్స్, పలు రకాల హార్డ్‌వేర్ ఉత్పత్తుల్లో సాఫ్ట్‌వేర్ లోపాలు, ఎర్రర్స్ (బగ్స్) కనిపెట్టి చెప్పిన వారికి ఆ సంస్థ ఏకంగా రూ.10.22 లక్షలను (దాదాపుగా 15వేల డాలర్లు) ప్రైజ్ మనీ కింద అందజేయనుంది. క్వాల్‌కామ్ కంపెనీ తాజాగా చేసిన ప్రకటనలో దీని గురించిన వివరాలను వెల్లడించింది.

క్వాల్‌కామ్‌కు చెందిన ఉత్పత్తుల్లో లోపాలను గుర్తిస్తే ఆ లోపం ఎటువంటిదో (హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ) విభాగాల వారీగా సదరు కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
అలా అందరు ఔత్సాహికుల నుంచి వచ్చే లేఖలను పరిశీలించాక, వారిలోంచి విజేతను ఎంపిక చేయనుంది. అనంతరం విజేతలకు పైన చెప్పిన విధంగా 15వేల డాలర్లను అందించనుంది. 

అయితే ఈ కార్యక్రమంలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 9వేలు, 8వేలు, 5వేల డాలర్లను విభాగాల వారీగా అందించనుంది. లోపం స్థాయి మరీ తక్కువగా ఉంటే అలాంటి దాన్ని చెప్పిన వారికి కూడా 2వేలు, 1వేయి డాలర్ల చొప్పున నగదును అందించనున్నారు. సాఫ్ట్‌వేర్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు క్వాల్‌కామ్ ప్రతినిధులు తెలియజేశారు.


No comments:

Post a Comment