5 నిమిషాల్లో 5 గంటల బ్యాటరీ పవర్ ఇచ్చే క్విక్ చార్జ్ 4.0..
స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్లను తయారు చేసే క్వాల్‌కామ్ సంస్థ కొత్తగా స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లు, టాబ్లెట్లు యూజర్లకు అమితమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇవ్వనున్నాయి. అదీ... కేవలం కొన్ని నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు, కొన్ని గంటల బ్యాకప్ వచ్చేలా చేసే క్విక్ చార్జ్ 4.0 అనే టెక్నాలజీని సదరు ప్రాసెసర్లు అందివ్వనున్నాయి. క్విక్ చార్జ్ 4.0 ఉన్న డివైస్‌లను కేవలం 5 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు, దాంతో దాదాపుగా 5 గంటల బ్యాకప్ వస్తుంది. మళ్లీ 5 గంటల తరువాతే డివైస్‌ను చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రయాణాల్లో ఉన్నవారికి ఎంతగానో ఉపకరిస్తుంది.
ఈ క్రమంలో క్విక్ చార్జ్ 4.0 టెక్నాలజీ ఉన్న డివైస్‌లను కేవలం 30 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు చార్జింగ్ 100 శాతం పూర్తవుతుంది. దీని వల్ల యూజర్లకు డివైస్‌లలో చార్జింగ్ అయిపోతుందన్న బెంగ ఉండదు. అంతేకాదు, క్విక్ చార్జ్ 4.0 ఉంటే డివైస్‌ల బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుంది. అంటే, ఎన్ని పనులు చేసుకున్నా బ్యాటరీ అంత త్వరగా అయిపోదన్నమాట.
2017లో స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్లు రానున్న నేపథ్యంలో సదరు ప్రాసెసర్లతోపాటు ఈ క్విక్‌చార్జ్ 4.0 టెక్నాలజీ కూడా కంబైన్డ్‌గా యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు వచ్చిన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఫోన్లలో క్విక్ చార్జ్ 2.0, 3.0 టెక్నాలజీలు ఉండగా, త్వరలో రానున్న దీని కొత్త వెర్షన్‌తో యూజర్లకు బ్యాటరీ బ్యాకప్ సమస్య తీరుతుందనే టెక్ నిపుణులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment